Revanth Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని రైల్వే జీఎం పేర్కొన్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy disappoints about pending railway projects

  • తన నియోజకవర్గంలో రైల్వే ప్రాజెక్టులపై రేవంత్ అసంతృప్తి
  • గతేడాది రైల్వే శాఖకు లేఖ
  • ఇటీవల రైల్వే మంత్రి పియూష్ గోయల్ తో వీడియో కాన్ఫరెన్స్
  • తనకు రైల్వే జీఎం ప్రత్యుత్తరం ఇచ్చారని వెల్లడి

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై గతేడాది రైల్వే శాఖకు లేఖ రాయడంతో పాటు, ఇటీవలే రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తో వీడియో కాన్ఫరెన్స్ లోనూ చర్చించానని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు.

తన లేఖకు బదులుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సుదీర్ఘ వివరణతో కూడిన లేఖ రాశారని తెలిపారు. రైల్వే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు సహకారం అందడంలేదని రైల్వే జీఎం పేర్కొన్నారని రేవంత్ వివరించారు.

"రైల్వే జీఎం అంశాల వారీగా జవాబు ఇచ్చారు. టీఆర్ఎస్ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, సహకారం అందించేందుకు ముందుకు రావడంలేదని తెలిపారు. సర్కారు పూర్తి నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యాయని జీఎం వివరించారు" అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News