DK Aruna: అపెక్స్ కౌన్సిల్ లో సీఎం జగన్ వాదనలపై డీకే అరుణ స్పందన
- నిన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం
- హాజరైన తెలుగు సీఎంలు
- జగన్ మాట్లాడిన అంశాల్లో తప్పేమీ లేదన్న డీకే అరుణ
నిన్న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఏపీ సీఎం జగన్ కు మద్దతు పలికారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ వెల్లడించిన అంశాలు సబబుగానే ఉన్నాయని, అందులో అభ్యంతర పెట్టాల్సిన అంశాలేవీ లేవని అన్నారు.
నిన్న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంతో జల వివాదాలు పరిష్కారం అవుతాయని భావించామని, కానీ సీఎం కేసీఆర్ సమర్థంగా తమ అభిప్రాయాలు తెలియజేయలేకపోయారని విమర్శించారు. ప్రాజెక్టులపై అభ్యంతరాలను సీఎం కేసీఆర్ సరిగా వివరించలేకపోయారని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు న్యాయం చేసేలా సీఎం కేసీఆర్ వ్యవహరించలేదని అన్నారు.
పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టులతో ఏపీ సర్కారు దాదాపు 8 టీఎంసీల నీరు తీసుకువెళుతుంటే, కేసీఆర్ మాటలతోనే సరిపెడుతున్నారని, ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.