Sasikala: చిన్నమ్మకు షాక్... శశికళకు చెందిన రూ.2 వేల కోట్లను అటాచ్ చేసిన ఐటీ శాఖ

IT Department attaches two thousand core rupees assets of Sasikala

  • బెంగళూరు పరప్పన జైలులో ఉన్న శశికళ
  • నోటీసులు పంపిన ఐటీ అధికారులు
  • శశికళ ఆస్తులను గతంలోనే గుర్తించిన ఐటీ శాఖ

తమిళనాడులో జయలలిత హయాంలో 'చిన్నమ్మ' పేరిట తెరవెనుక శక్తిగా వెలిగిన శశికళ ఇప్పుడు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. తాజాగా శశికళకు ఆదాయ పన్నుశాఖ భారీ షాకిచ్చింది. మరికొన్నాళ్లలో జైలు నుంచి విడుదల కానున్న శశికళ మళ్లీ రాజకీయాల్లో తనదైన రీతిలో హవా సాగించాలని భావించారు.

అయితే ఆమెకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయడం ద్వారా ఐటీ శాఖ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. శశికళకు చెందిన ఈ ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద ఐటీ అధికారులు స్తంభింపచేశారు. ప్రస్తుతం బెంగళూరు పరప్పన జైలులో ఉన్న శశికళకు ఈ మేరకు నోటీసులు పంపారు.

కాగా, అటాచ్ చేసిన ఆస్తులలో కొడనాడు, సిరతవూర్ ప్రాంతాల్లో ఆమెకు రెండు ఆస్తులు ఉండగా, అవి రెండు శశికళ పేరిటే ఉన్నాయి. ఇవేకాకుండా అనేక ఆస్తులను గతంలోనే గుర్తించిన ఐటీశాఖ తన దర్యాప్తులో వాటిని నిర్ధారించుకుంది. ఈ క్రమంలోనే అటాచ్ చేసింది.

  • Loading...

More Telugu News