H1B Visa: హెచ్1బీ వీసాల జారీ విధానంలో కొత్త నిబంధనలు తెచ్చిన అమెరికా

US Government hardens H1B Visa rules

  • హెచ్1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం
  • 85 వేలకు మించి విదేశీ నిపుణులను తీసుకోరాదని ఆదేశాలు
  • ప్రత్యేక నైపుణ్యాల నిర్వచనం మార్పు

ఈ ఏడాది చివరి వరకు హెచ్1బీ వీసాలు నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం ఇప్పుడా వీసాల జారీ విధానంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. వీసాల నిషేధంపై అనేక కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, నిషేధం ఎత్తివేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో అమెరికా సర్కారు తమ దేశ ప్రజలకు మేలు చేకూర్చేలా హెచ్1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసింది. ఇకపై అమెరికా కంపెనీలు 85 వేల మందికి మించి విదేశీ నిపుణులను తీసుకోవడం కుదరదు.

అంతేకాదు, హెచ్ బీ వీసా విధానంలో అభ్యర్థుల ప్రత్యేక నైపుణ్యాల నిర్వచనాన్ని కూడా మార్చారు. ప్రత్యేక నైపుణ్యాల సంఖ్యను కూడా తగ్గించినట్టు తెలుస్తోంది. దీనిపై అమెరికా హోంశాఖ కార్యదర్శి చాడ్ వోల్ఫ్ స్పందిస్తూ, ఆర్థిక భద్రతతోనే దేశ భద్రత ముడిపడి ఉంటుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అమెరికా ప్రజలే అత్యధిక లబ్ది పొందేలా చట్టపరిధిలో వీలైనంతగా చేయాలి అని అభిప్రాయపడ్డారు.

కాగా, హెచ్1బీ వీసాల విధానంలో అమెరికా కంపెనీలకు పరిమితులు విధించడం భారతీయ ఐటీ నిపుణులకు నిరాశ కలిగించే విషయమే. అమెరికా కంపెనీల్లో అత్యధిక సంఖ్యలో సేవలు అందిస్తున్నది భారత ఐటీ నిపుణులేనన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News