Hatras: హత్రాస్ బాధితురాలి పేరు బయటపెట్టిన దిగ్విజయ్ సింగ్, నటి స్వరా భాస్కర్... కేసు నమోదు

Case on Digvijay and Swara Bhasker for Revele Hatras Victime

  • రేప్ కేసులో బాధితురాలి పేరు చెప్పరాదని ఆదేశాలు
  • వాటిని మీరిన కాంగ్రెస్, బీజేపీ నేతలు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో హత్యాచారానికి గురైన బాధితురాలి పేరును సోషల్ మీడియాలో వెల్లడిస్తూ, ఆమె ఫొటోలను పోస్ట్ చేసిన పలువురు నెటిజన్లపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి, ఎవరూ అత్యాచార బాధితురాలి పేర్లను వెల్లడించరాదన్న సంగతి తెలిసిందే.

గత నెలలో హాత్రాస్ లో ఓ దళిత బాలికపై మొక్కజొన్న పొలాల్లో దారుణంగా ప్రవర్తించిన నిందితులు, ఆమె మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇక, ఆమె పేరును, చిత్రాలను వెల్లడించిన వారిపై ఐపీసీ సెక్షన్ 228తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 72 కింద కేసు పెట్టినట్టు సదాబాద్ సర్కిల్ ఆఫీసర్ తెలిపారు. కాగా, పోలీసులు కేసు పెట్టిన వారిలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, హీరోయిన్ స్వరా భాస్కర్ తదితరులు ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News