Jr NTR: అపరిచిత వ్యక్తులతో పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు: ఎన్టీఆర్

Junior NTR campaigns for women security in Social Media
  • సామాజిక మాధ్యమాల్లో మహిళలకు వేధింపులు
  • వ్యక్తిగత సమాచారం పోస్టు చేయవద్దన్న ఎన్టీఆర్
  • ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచన
సామాజిక మాధ్యమాల్లో మహిళలపై జరిగే వేధింపుల పట్ల హైదరాబాద్ సిటీ పోలీస్ ఓ వీడియో రూపొందించింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి చేతిలో మోసపోయిన ఓ యువతి గాథను అందులో చూపించారు. ఈ వీడియో చివర్లో టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ తన సందేశం అందించారు.

అపరిచిత వ్యక్తులతో పరిచయాలు అనుకోని కష్టాలకు దారితీసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దని హితవు పలికారు. సోషల్ మీడియాలో ఆన్ లైన్ పరిచయాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే ధైర్యంగా హైదరాబాద్ సైబర్ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Jr NTR
Women Security
Social Media
Hyderabad Police

More Telugu News