Nara Lokesh: స్వయంగా వైసీపీ ప్రభుత్వమే అచ్చెనాయుడ్ని కేసులో ఇరికించాం అని అంగీకరించింది: నారా లోకేశ్

Nara Lokesh reacts on Atchennaidu issue of ESI scam
  • ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నపై ఆరోపణలు
  • అరెస్ట్.. ఆపై బెయిల్ పై విడుదల
  • ప్రభుత్వానిది రాక్షసానందం అన్న లోకేశ్
ఈఎస్ఐ స్కాం పేరిట టీడీపీ సీనియర్ నేత అచ్చెనాయుడ్ని ఏసీబీ అరెస్ట్ చేయడం, ఆపై బెయిల్ పై ఆయన విడుదల కావడం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. ఈఎస్ఐ స్కాంలో నిజం చెప్పులు వేసుకునేలోపు జగన్ గారి అబద్ధం ప్రపంచాన్ని చుట్టివచ్చిందని వ్యంగ్యంగా అన్నారు.

రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అచ్చెనాయుడిని కేసులో ఇరికించి రాక్షసానందం పొందారని, కానీ చివరికి సత్యమే గెలిచిందని పేర్కొన్నారు. స్వయంగా వైసీపీ ప్రభుత్వమే అచ్చెనాయుడిని కేసులో ఇరికించాం అని అంగీకరించిందని లోకేశ్ తన ట్వీట్ లో తెలిపారు. అంతేకాదు, తన వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఓ వీడియోను కూడా పంచుకున్నారు.

Nara Lokesh
Atchannaidu
ESI Scam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News