Donald Trump: ట్రంప్, బైడెన్ మధ్య రెండో డిబేట్​ రద్దు!

Next scheduled presidential debate between Trump and Biden has been canceled

  • అక్టోబరు 15న జరగాల్సిన డిబేట్
  • ఇక నేరుగా ఇరువురు మూడో డిబేట్
  • అక్టోబర్ 22న మూడో డిబేట్
  • ట్రంప్ కి కరోనా వల్ల రద్దు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అక్టోబరు 15న ట్రంప్‌, బైడెన్‌ మధ్య రెండో డిబేట్‌ జరగాల్సి ఉండగా అది రద్దు అయింది. ఇప్పటికే ఈ ఇద్దరు అభ్యర్థులు తొలి డిబేట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ట్రంప్‌, బైడెన్‌ల మధ్య తొలి డిబేట్ సెప్టెంబరు 29న జరిగింది. రెండో డిబేట్ రద్దు కావడంతో ఇక నేరుగా ఇరువురు మూడో డిబేట్ లో పాల్గొనాల్సి ఉంటుంది.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన రెండో డిబేట్ జరగదంటూ ఈ మేరకు కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్(సీపీడీ) ప్రకటించింది. అక్టోబర్ 15న జరగాల్సిన డిబేట్ రద్దు కావడంతో ఇక ఇద్దరు అక్టోబర్ 22న జరగాల్సిన డిబేట్ లో పాల్గొననున్నారు. ట్రంప్ కరోనా బారిన పడిన నేపథ్యంలో రెండో డిబేట్ పై ఇటీవల సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే.

ఆ డిబేట్‌ను వర్చువల్‌ పద్ధతిలో జరపాలన్న కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ ‌ నిర్ణయాన్ని ట్రంప్‌ ఒప్పుకోలేదు. తాను నేరుగా పాల్గొంటానని అన్నారు. బైడెన్‌ మాత్రం వర్చువల్‌ డిబేట్‌కు అంగీకరించారు. అయితే, డిబేట్ లో పాల్గొనే వారి ఆరోగ్యంతో పాటు భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము చర్చలను వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలనుకున్నామని సీపీడీ తెలిపింది. ఆ డిబేట్‌ వర్చువల్‌గానే జరుగుతుందని  స్పష్టం చేసినప్పటికీ, చివరకు తమ నిర్ణయాన్ని మార్చుకుంది. డిబేట్ ను పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించింది.

  • Loading...

More Telugu News