Vijay Sai Reddy: స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ?: విజయసాయిరెడ్డి
- రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు యత్నించారు
- పసివాళ్లని కూడా వదల్లేదు కదా?
- మీరు వాళ్ల జేబులు ఖాళీ చేశారు
- ఏది విజన్? ఏది దుబారా?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు డబ్బును దుబారా చేశారని ఆయన ఆరోపించారు.
‘రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా? మీరు వాళ్ల జేబులు ఖాళీ చేస్తే, ఇప్పుడా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు జగన్ గారు.. తేడా తెలుస్తోందా?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
‘పోలవరం యాత్రలకు చంద్రబాబు చేసిన ఖర్చు 400 కోట్లు, దొంగ దీక్షలకు మరో 300 కోట్ల రూపాయలు ఊదేశాడు. జగన్ గారు 43 లక్షల మంది విద్యార్థులకు బ్యాగు, నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బూట్లు, సాక్స్, బెల్ట్ తో కూడిన కిట్ ఇవ్వడానికి చేసిన ఖర్చు 650 కోట్ల రూపాయలు. ఏది విజన్ ? ఏది దుబారా?’ అని విజయసాయిరెడ్డి నిలదీశారు.