Gorantla Butchaiah Chowdary: అది ముమ్మాటికీ మరో క్విడ్ ప్రోకోలో భాగమే!: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdary fires on Jagan
  • పాఠ్యపుస్తకాలకు పార్టీ రంగులేయడమేంటి?
  • స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
  • అవినీతిపరులపై ఎలాంటి చర్యలు లేవు
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. విద్యార్థులకు అందిస్తున్న పాఠ్యపుస్తకాలకు వైసీపీ రంగులేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఏదో తన బాబు సొమ్మేదో ఇచ్చినట్టు ఈ పనులేంటని మండిపడ్డారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కనీస పారిశుద్ధ్య పనులను కూడా చేయలేని దుస్థితిలో స్థానిక సంస్థలు ఉన్నాయని అన్నారు.

14, 15వ ఆర్థిక సంఘం నిధులను కానీ, ఎన్ఆర్ఈజీఎస్, మైనింగ్ సెస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయమంతా నేరుగా సీఎఫ్ఎంఎస్కేకు జమవుతోందని బుచ్చయ్య చౌదరి చెప్పారు. విశాఖ బేపార్క్, కాకినాడ సెజ్ లను హెటిరో, అరబిందో సంస్థలకు అప్పగించడం ముమ్మాటికీ మరో క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపించారు. ఆర్థిక నేరగాడి ప్రభుత్వం నీతి వాక్యాలు చెప్పడానికే పరిమితమైందని మండిపడ్డారు. అవినీతికి పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
Jagan
YSRCP

More Telugu News