Dinesh Karthik: కార్తీక్, గిల్ అర్ధసెంచరీలు... కోల్ కతా గౌరవప్రద స్కోరు

Opener Gill and skipper Dinesh Karthik gets fifties as KKR posted respectable score
  • అబుదాబిలో కోల్ కతా వర్సెస్ పంజాబ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు
ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య అబుదాబిలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (47 బంతుల్లో 57), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 58; 8 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధసెంచరీలతో అలరించారు.

వీళ్లిద్దరే కాకుండా, ఇయాన్ మోర్గాన్ (24) ఓ మోస్తరుగా రాణించాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (4) ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. నితీశ్ రాణా (2) రనౌట్ అయ్యాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
Dinesh Karthik
Shubhman Gill
KKR
KXIP
Abudhabi
IPL 2020

More Telugu News