Jagan: ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్

Jagan gives green signal to teachers transfers
  • బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు  
  • ఫైలుపై సంతకం చేసిన జగన్
  • రెండు, మూడు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వీరందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు ఆమోదం తెలుపుతూ ఫైలుపై సంతకం చేశారు. బదిలీలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని ప్రభుత్వం ప్రకటించింది. 2020 ఫిబ్రవరి 29వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారంతా బదిలీలకు అర్హులని తెలిపింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను చేపడతామని వెల్లడించింది. గత మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ నిర్ణయంతో ట్రాన్స్ ఫర్లకు అవకాశం కలిగింది.
Jagan
YSRCP
Teachers
Transfers

More Telugu News