Sunrisers: మరోసారి భారీ స్కోరు ముంగిట నిలిచిపోయిన సన్ రైజర్స్

Once again Sunrisers posts respectable score

  • దుబాయ్ లో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసిన సన్ రైజర్స్
  • మనీశ్ పాండే అర్ధసెంచరీ

ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓ గుర్తింపు ఉంది. అదేంటంటే...  ఓ మోస్తరు స్కోర్లను కూడా విజయవంతంగా కాపాడుకోగల సత్తా ఆ జట్టుకుంది. గతంలో ఎన్నోసార్లు ఇది రుజువైంది. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో దుబాయ్ లో జరుగుతున్న మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసింది. మరి ఈ స్కోరును కాపాడుకుంటుందో లేదో చూడాలి!

ఇక మ్యాచ్ విషయానికొస్తే...యువ ఆటగాడు మనీశ్ పాండే 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు సాధించాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సులతో 48 పరుగులు చేయగా, మరో ఓపెనర్ బెయిర్ స్టో 16 పరుగులు చేసి త్యాగి బౌలింగ్ లో అవుటయ్యాడు. కేన్ విలియమ్సన్ 12 బంతుల్లో 2 సిక్సర్లతో అలరించాడు. టీమిండియా అండర్-19 సారథి ప్రియమ్ గార్గ్ 8 బంతుల్లో 15 పరుగులు నమోదు చేశాడు. అతడి స్కోరులో ఒక ఫోరు, ఒక సిక్సు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో త్యాగి, ఆర్చర్, ఉనద్కట్ తలో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News