Corona Virus: కరోనా వ్యాప్తి ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు.. పండుగలు ఇంట్లోనే చేసుకోండి: కేంద్రమంత్రి హర్షవర్ధన్

dont get out in festiv season says union minister Harshvardhan

  • వేడుకలతో తమను మెప్పించాలని ఏ దేవుడూ కోరుకోరు
  • బయటకు వచ్చి ఇబ్బందుల పాలు కావొద్దు
  • త్వరలోనే దేశీయ కరోనా టెస్ట్ కిట్ ఫెలూడా పేపర్ స్ట్రిప్ అందుబాటులోకి

పండుగ వేడుకలతో తమను మెప్పించాలని ఏ మతమూ, ఏ దేవుడూ కోరుకోరని, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మతపరమైన పండుగలు, వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రజలను కోరారు.

నిన్న సోషల్ మీడియాలో ‘సండే సంవాద్’ పేరుతో ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైరస్ వ్యాప్తి ఇప్పట్లో పూర్తిగా సమసిపోయే అవకాశం లేదు కాబట్టి రాబోయే పండుగ సీజన్‌లో ఊరేగింపులు, మతపరమైన సభలకు దూరంగా ఉండాలని కోరారు.

చలికాలంలో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నైనా పూర్తిగా నిర్ధారించుకోకుండా ఇతరులతో పంచుకోవద్దన్నారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు వైరస్ బారినపడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు మంత్రి వివరించారు.

ఇందుకోసం కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు రాష్ట్రాలకు రూ. 3 వేల కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్న హర్షవర్ధన్.. త్వరలోనే దేశీయ కరోనా కిట్ ఫెలూడా పేపర్ స్ట్రిప్ టెస్ట్ అందుబాటులోకి వస్తుందన్నారు.

  • Loading...

More Telugu News