Note for Vote: ‘మన వాళ్లు బ్రీఫుడ్ మీ’ అన్నదెవరో తేలిందిగా: విజయసాయి రెడ్డి

Vijayasai Latest Comments on Chandrababu
  • ఓటుకు నోటు కేసును ప్రస్తావించిన విజయసాయి
  • పారిపోయి కరకట్టకు వచ్చారు
  • సాక్ష్యాలు పక్కా అంటున్న విజయసాయి
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఫోన్ సంభాషణలను ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసిందని చెబుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టిన ఆయన, "ఓటుకు నోటు కేసులో అరెస్టు భయంతోనే కరకట్టకు పారిపోయి వచ్చాడని గుసగుసలు. ‘మన వాళ్లు బ్రీఫుడ్ మీ’ అనే వాయిస్ తనదేనని ఫోరెన్సిక్ ల్యాబులు తేల్చాయి. సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయంట. ‘వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు’ సామెత ఇలాంటి వారి కోసమే పుట్టి ఉంటుంది" అని అన్నారు.
Note for Vote
Vijayasai Reddy
Chandrababu
Twitter

More Telugu News