Delhi: నార్త్ ఇండియా మొత్తం వాయు కాలుష్యంతో బాధపడుతోంది: మనీశ్ సిసోడియా

Pollution an issue not only for Delhi but entire north India says Manish Sisodia
  • వాయు కాలుష్యం ఢిల్లీకే పరిమితం కాలేదు
  • కరోనా కూడా తోడు కావడం ప్రమాదకరంగా మారింది
  • కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు
పంజాబ్, హర్యానాల్లో రైతులు వరి, గోధుమ దిబ్బలను పొలాల్లోనే తగలబెట్టడం ప్రతి ఏటా జరిగే విషయమే. దీని వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనిపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మాట్లాడుతూ, వాయుకాలుష్యం కేవలం ఢిల్లీ వరకే పరిమితం కాలేదని, మొత్తం ఉత్తర భారతంపై దీని ప్రభావం ఉందని చెప్పారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ఏడాది పొడవునా కృషి చేస్తోందని అన్నారు.

అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఈ పొగ వల్ల ఉత్తరాది మొత్తం ఇబ్బంది పడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. కాలుష్య నివారణలో కేంద్రం తన వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎవరి ప్రయత్నం వారు చేస్తే కాని ఈ సమస్యను తగ్గించలేమని అన్నారు. కాలుష్యానికి కరోనా వైరస్ కూడా తోడు కావడం ప్రజలకు ప్రమాదకరంగా మారిందని చెప్పారు.
Delhi
Pollution
Manish Sisodia
AAP
BJP

More Telugu News