YSRCP: బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై దాడికి యత్నం.. నిందితుడిని పట్టుకున్న గన్‌మెన్

man tried to attack on ysrcp mp nandigam suresh
  • గత రాత్రి 10.30 గంటల సమయంలో ఘటన
  • ఎంపీ కారుకు బైక్ అడ్డంపెట్టి దాడికి యత్నం
  • పట్టుకుని పోలీసులకు అప్పగించిన గన్‌మెన్
బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. గుంటూరులోని ఎంపీ నివాసం వద్ద గత రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణ చంద్రరావు ఎంపీపై దాడికి యత్నించాడు.

ఎంపీ తన ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కారులో బయటకు రాగా, పూర్ణచంద్రరావు తన బైకును కారుకు అడ్డంగా పెట్టాడు. ఎంపీ కారు ఆపగా రాడ్డుతో కారుపై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఎంపీ గన్‌మెన్ అడ్డుకోవడంతో, నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. గన్‌మెన్ అతడిని వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. దాడికి గల కారణం తెలియాల్సి ఉంది.
YSRCP
MP
Nandigam Suresh
Guntur District
Andhra Pradesh

More Telugu News