Doctor reddys: రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్‌కు డాక్టర్ రెడ్డీస్‌లో ఫేజ్-2 పరీక్షలు
- అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్న డాక్టర్ రెడ్డీస్
- రెండో దశలో 100 మందిపై పరీక్షలు
- అనుమతి కోసం సిఫారసు చేసిన డీసీజీఐ నిపుణులు
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచంలోనే తొలిసారి రష్యా తీసుకొచ్చిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్ భారత్‌లో రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైంది. ఈ టీకాకు 2, 3 దశల పరీక్షలను సంయుక్తంగా నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఈ నెల 13న డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తు చేసుకుంది. రెండో దశలో 100 మందిపై, మూడో దశలో 1400 మంది వలంటీర్లపై పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తుపై స్పందించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిపుణులు క్లినికల్ ట్రయల్స్ కోసం సిఫారసు చేశారు.