Rajasekhar: ఈ వార్త నిజమే.. నేను, జీవిత, పిల్లలు కరోనా బారినపడ్డాం: హీరో రాజశేఖర్

The news is true that Jeevitha Kids and I have tested positive for corona and are currently being treated in the hospital
  • ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాం
  • ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారు
  • నేను, జీవిత కూడా బాగానే ఉన్నాం
  • త్వరలోనే ఇంటికి తిరిగొస్తాము
సినీ నటుడు రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు వారం రోజుల క్రితం కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ రోజు ఈ విషయంపై తన ట్విట్టర్ ఖాతాలో రాజశేఖర్ స్పష్టతనిచ్చారు.

‘ఈ వార్త నిజమే.. జీవిత, పిల్లలు, నేను కరోనా బారిన పడ్డాము. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాం. ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారు. నేను, జీవిత కూడా బాగానే ఉన్నాం. త్వరలోనే ఇంటికి తిరిగొస్తాము.. థాంక్యూ’ అని రాజశేఖర్ స్పష్టంచేశారు.

కాగా, ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించే ఓ సినిమాలో రాజశేఖర్ నటించాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగు వాయిదా పడింది.
Rajasekhar
jeevitha
Tollywood
Corona Virus
COVID19

More Telugu News