Centre: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసిన కేంద్రం... తొలిదశలో 30 కోట్ల మందికి టీకా

Centre plans to distribute corona vaccine in first phase

  • కరోనా వ్యాక్సిన్ కోసం సాగుతున్న పరిశోధనలు
  • పంపిణీకి కసరత్తులు ప్రారంభించిన కేంద్రం
  • వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యం

కరోనా మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ కోసం కార్యాచరణ సిద్ధం చేసింది. తొలిదశలో ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న దానిపై స్పష్టమైన అవగాహనకు వచ్చింది. దేశంలోని 30 కోట్ల మందికి మొదట కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

70 లక్షల మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది, 2 కోట్ల మంది రక్షణ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 26 లక్షల మందికి పైగా సాధారణ ప్రజలు (50 ఏళ్లకు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వ్యక్తులు) ఈ జాబితాలో ఉన్నారు. బూస్టర్ డోస్ తో కలిసి తొలి విడతలో 60 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయని భావిస్తున్నారు. మొదటి దశలో టీకా అందుకునేవారి జాబితాలు అక్టోబరు చివరినాటికి, లేదా నవంబరు మొదటివారం నాటికి సిద్ధమవుతాయని కేంద్ర వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News