VK Pal: వచ్చేది శీతాకాలం... కరోనా విజృంభించే అవకాశాలున్నాయంటున్న నీతి ఆయోగ్ సభ్యుడు

Niti Aayog member VK Pal says India may witness second wave of corona in winter

  • కరోనా సెకండ్ వేవ్ పై వీకే పాల్ వ్యాఖ్యలు
  • యూరప్ లో ఇలాగే జరుగుతోందని వెల్లడి
  • మరింత పరిశోధనలు చేస్తున్నట్టు వివరణ

భారత్ లో మరికొన్ని వారాల్లో శీతాకాలం రానుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే కొన్నినెలల పాటు అత్యంత శీతల వాతావరణం ఉంటుంది. ఇలాంటి చలి వాతావరణంలో కరోనా వైరస్ ప్రబలే అవకాశాలు అధికం అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అభిప్రాయపడ్డారు.

యూరప్ లో కరోనా మహమ్మారి తిరగబెడుతోందని, నెమ్మదించినట్టే నెమ్మదించి మళ్లీ విరుచుకుపడుతోందని, భారత్ లో రాబోయేది చలికాలం కావడంతో భారత్ లో ఈ వైరస్ తీవ్రమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. దీనిపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేస్తున్నట్టు పాల్ వెల్లడించారు. ప్రస్తుతం భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని, అయితే అనేక అవరోధాలను అధిగమించాల్సి ఉందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే భద్రపరిచేందుకు కావాల్సినన్ని కోల్డ్ స్టోరేజిలు ఉన్నాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News