Nara Lokesh: వరద బాధితుల కష్టాలు వింటుంటే ప్రభుత్వం ఉండీ ఏంటి ప్రయోజనం అనిపించింది: నారా లోకేశ్

Nara Lokesh visits flood hit East Godavari district

  • ఉభయ గోదావరి జిల్లాలను ముంచెత్తిన వరదలు
  • తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన లోకేశ్
  • రైతులకు పరామర్శ

ఉభయ గోదావరి జిల్లాలను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. మొదట గొల్లప్రోలు ఈబీసీ కాలనీ ఏలేరు ముంపు బాధితులను కలుసుకున్నారు. వారి సాధకబాధకాలు విన్న తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అక్కడి మహిళలు వాళ్ల కష్టాలు చెబుతుంటే ప్రభుత్వం ఉండి కూడా ఏంటి ప్రయోజనం అనిపించిందని వ్యాఖ్యానించారు.

అనంతరం సుద్దగడ్డ వాగు ఉద్ధృతి కారణంగా నీటమునిగి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అక్కడి రైతులను పరామర్శించారు. లోకేశ్ అక్కడ్నించి పిఠాపురం మీదుగా ఉప్పాడ చేరుకున్నారు. సూరాడపేటలో సముద్ర కోతకు గురై ఇళ్లు కోల్పోయిన మత్స్యకారులను  పరామర్శించారు. తన పర్యటనపై ట్విట్టర్ లో పోస్టు చేసిన ఆయన... ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు పాలకులు ముఖం చాటేస్తే బాధితులు ఏమైపోవాలని ప్రశ్నించారు. కాగా, లోకేశ్ పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు  తరలివచ్చాయి.

  • Loading...

More Telugu News