Hyderabad: హైదరాబాదులో 53 చెరువులు దెబ్బతిన్నాయి.. 185 చెరువులు నిండాయి: ఇరిగేషన్ శాఖ
- మూడు చెరువులకు గండి పడింది
- చెరువులు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం
- చెరువుల పరిరక్షణకు టీములు ఏర్పాటు చేశాం
భారీ వర్షాలతో హైదరాబాదులోని చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. మొత్తం 185 చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోయాయని ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. నగరంలో 53 చెరువులు దెబ్బతిన్నాయని చెప్పారు. గండిపడిన మూడు చెరువులకు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. బండ్లగూడ, మన్సూరాబాద్, మూసాపేట్ చెరువులు తెగాయనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. చెరువుల కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చెరువుల పరిరక్షణకు 15 టీములను ఏర్పాటు చేశామని చెప్పారు.