Anand Mahindra: పైన అంగీ, కింద లుంగీ... దీన్ని మించింది లేదు: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra advocates for Lungi compare to western wear

  • దక్షిణాది దుస్తులపై అభిమానాన్ని చాటుకున్న ఆనంద్ మహీంద్రా
  • విదేశీ దుస్తులు మన లుంగీకి సరిరావని వ్యాఖ్యలు
  • వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్యాషన్ కు భారతదేశమే కేంద్రమని వెల్లడి

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా భారతీయతను విశేషంగా ప్రచారం చేసేవాళ్లలో ముందు వరుసలో ఉంటారు. సంస్కృతి, సంప్రదాయాలే భారతీయతకు పునాదులని నమ్ముతూ దేశీయ అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా ఓ విదేశీ ఫ్యాషన్ సంస్థ వర్క్ ఫ్రమ్ హోం కలెక్షన్స్ పేరిట తాజా దుస్తుల శ్రేణిని విడుదల చేసింది.

దీనికి సంబంధించిన యాడ్ లో ఓ పురుష మోడల్ తో కోటు, టై ధరింపజేసి, కింది భాగంలో లోదుస్తులతో సరిపెట్టారు. కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో సదరు ఫ్యాషన్ సంస్థ కాలానుగుణంగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించింది. దీన్ని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ప్రస్తావించారు.

"క్షమించాలి, ఈ కవర్ పేజీని మీరు చెత్తబుట్టలో వేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్యాషన్ కు ఇక ముఖ్య కేంద్రం భారతదేశమే. పైన అంగీ, కింద లుంగీ... దీన్ని కొట్టేదే లేదు. ఇంతకుమించిన సౌకర్యం ఏ దుస్తుల్లోనూ రాదు. ఎంతో స్టయిలిష్ గా ఉంటుంది, పొరబాటున పైకి లేచి నిలబడినా ఏమంత ఎబ్బెట్టుగా అనిపించదు" అని దేశీ దుస్తులపై, ముఖ్యంగా దక్షిణాదిపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

  • Loading...

More Telugu News