Devineni Uma: ఇళ్లకు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తామన్నారు.. చెప్పిన మాటలు ఏమయ్యాయి?: దేవినేని ఉమ

devineni uma slams jagan

  • నిర్వహణలేక పాడైపోతున్న టిడ్కో ఇళ్లు
  • సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలు
  • నాడు ఇదే ఇళ్లను ఉచితంగా ఇస్తామన్నారు
  • 17 నెలలైనా పేదలకు ఎందుకు ఇళ్లు ఇవ్వడం లేదు?  

గృహ ప్రవేశాలకు సిద్ధంగా 2 లక్షలకు పైగా ఇళ్లు ఉన్నప్పటికీ వాటిని పేదలకు ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం ఏడిపిస్తోందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ వైసీపీ సర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. టిడ్కో గృహాలు పాడుబడుతున్నాయని అందులో పేర్కొన్నారు. ఉచితంగా ఇస్తామని నాడు జగన్‌ హామీ ఇచ్చారని, అయితే, అలా చేస్తే సర్కారుపై వేల కోట్ల రూపాయల భారం పడుతుందని, దీంతో ఏడాదిన్నరగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇళ్ల కోసం పేదలు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లించారని తెలిపారు. వీటిని దేవినేని ఉమ ప్రస్తావించారు.

‘గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న తెలుగు దేశం పార్టీ పేదల కోసం నిర్మించిన లక్షలాది గృహాలు.. నిర్వహణలేక పాడైపోతున్న టిడ్కో ఇళ్లు.. సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలు.. నాడు ఇదే ఇళ్లను ఉచితంగా ఇస్తాం, కట్టిన డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయి? 17 నెలలైనా పేదలకు ఎందుకు ఇళ్లు ఇవ్వడం లేదు?’ అని సర్కారును దేవినేని ఉమ నిలదీశారు.

  • Loading...

More Telugu News