David Warner: వారిద్దరూ పడ్డ కష్టానికి విజయం రూపంలో ప్రతిఫలం దక్కింది: నిన్నటి మ్యాచ్‌పై వార్నర్‌

david warner about win

  • నిన్న సాధించినది ఓ సంపూర్ణ విజయం
  • విజయ్‌ శంకర్‌, మనీశ్ పాండే బాగా రాణించారు
  • ఐపీఎల్‌లో ప్రపంచ శ్రేణి బౌలర్లతో తలపడే అవకాశం
  • బంతి స్వింగ్‌ అయ్యే అవకాశం కూడా ఉంది

ఐపీఎల్-2020లో భాగంగా నిన్న దుబాయ్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ 11 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. హైదరాబాద్‌ జట్టు సారథి డేవిడ్ వార్నర్‌ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌ను తాము ప్రారంభించిన విధానం అద్భుతమని భావిస్తున్నానని, పవర్‌ప్లే అనంతరం ఆటను తమ చేతుల్లోకి తెచ్చుకోగలిగామని తెలిపాడు.

నిన్న సాధించినది ఓ సంపూర్ణ విజయమని, విజయ్‌ శంకర్‌, మనీశ్ పాండే బాగా రాణించారని డేవిడ్ వార్నర్ చెప్పాడు. వారిద్దరు పడ్డ కష్టానికి విజయం రూపంలో ప్రతిఫలం దక్కిందని తెలిపాడు. ఐపీఎల్‌లో ప్రపంచ శ్రేణి బౌలర్లతో తలపడే అవకాశం ఉంటుందని, మరోవైపు బంతి స్వింగ్‌ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పాడు.

దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, అయితే,  బౌలర్‌ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తుంటే ఏం చేయలేమని చెప్పాడు. ఒకవేళ వీలైతే ఎదురుదాడి చేయాలని, అయితే తాను మాత్రం ఔటయ్యానని చెప్పాడు. తమ జట్టుకు జేసన్‌ హోల్డర్‌ అదనపు బలమని ఆయన కొనియాడాడు. గత మ్యాచుల్లో తాము త్వరగా వికెట్లు కోల్పోలేదని, ఈ కారణంగా తమ జట్టులోని మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు ఆడే అవకాశాలు సరిగ్గా రాలేదని చెప్పాడు.

  • Loading...

More Telugu News