Sonu Sood: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో సినీనటుడు సోనూ సూద్ విగ్రహం
- కోల్కతాలో సోను విగ్రహం
- ప్రఫుల్లా కనక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
- కార్మికులకు చేసిన సాయాన్ని తెలిపేలా విగ్రహం
కరోనా వైరస్ను కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో వలస కార్మికులు దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోగా వారిలో చాలా మంది సొంత ప్రాంతాలకు చేరుకునేందుకు వీలుగా సాయం చేసి సినీనటుడు సోనూ సూద్ రియల్ హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే. అనంతరం కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ఈ నేపథ్యంలో తాజాగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన మండపంలో కొందరు భక్తులు ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన పట్ల తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ప్రఫుల్లా కనక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోనూ సూద్ విగ్రహాన్ని పెట్టారు. ఆయన కార్మికులకు చేసిన సాయాన్ని తెలిపేలా కార్మికులు, బస్సుల బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కొందరు ట్విట్టర్ లో పోస్ట్ చేయగా దీనిపై సోనూ సూద్ స్పందించాడు. తనకు జీవితంలో లభించిన అతిపెద్ద పురస్కారం ఇదేనని అన్నాడు.