Angela Merkel: కరోనా మరింత వేగంగా విస్తరిస్తోంది.. రాబోయేది గడ్డు కాలమే: జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్

Corona is spreading very fast says Angela Merkel

  • కరోనా ప్రస్తుతం తీవ్ర దశలో ఉంది
  • కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది
  • ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి

కరోనా వైరస్ గతం కంటే ఎక్కువ వేగంతో విస్తరిస్తోందని జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే వేగం పెరిగిందని చెప్పారు. ఈ పరిస్థితిని పరిశీలిస్తే... రాబోయే రోజుల్లో జర్మనీ మరింత ఎక్కువ ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని మెర్కెల్ చెప్పారు. ప్రస్తుతం కరోనా తీవ్ర దశలో ఉందని తెలిపారు. జర్మనీలో వేసవి ముగిసిందని చెప్పారు. చలి కాలాన్ని గడపడం, క్రిస్మస్ జరుపుకోవడం వంటిని ప్రజల మీదే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రజలంతా ప్రయాణాలు, ఔట్ డోర్ మీటింగులను తగ్గించుకోవాలని చెప్పారు. అందరూ జగ్రత్తగా ఉండాలని అన్నారు.

  • Loading...

More Telugu News