Dasara: ఇంద్రకీలాద్రిపై చివరి దశకు చేరుకున్న శరన్నవరాత్రి ఉత్సవాలు.. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు
- ఎడమ చేతితో చెరకుగడ, కుడి చేతితో అభయాన్ని ప్రసాదిస్తున్న అమ్మవారు
- దర్శనానికి పోటెత్తిన భక్తులు
- తెప్పోత్సవానికి అనుమతి నిరాకరణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. నేడు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఎడమ చేతితో చెరకుగడ, కుడి చేతితో అభయాన్ని ప్రసాదిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కాగా, కృష్ణా నదికి వరద పోటెత్తుతుండడంతో ఉత్సవాల ముగింపు రోజున సాయంత్రం నిర్వహించే తెప్పోత్సవ సేవకు అధికారులు నిరాకరించారు.
దీంతో దుర్గాఘాట్ వద్ద నదిలోనే హంస వాహనాన్ని ఉంచి పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. హంసవాహనంలోకి ఎనిమిది మంది పండితులు, ఇద్దరు అర్చకులు, ఇద్దరు కర్రస్వాములు, ఇద్దరు కాగడాలు పట్టేవారు, ఆరుగురు భజంత్రీలవారు, ఓ ఎస్‌ఐని మాత్రమే అనుమతించనున్నారు.