Bihar: ప్రచారసభలోనే ఎమ్మెల్యే అభ్యర్థిని హత్య చేసిన దుండగులు

MLA candidate murdered in Bihar
  • జనతాదళ్ రాష్ట్రవాది పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన నారాయణ సింగ్
  • జనాల్లో కలిసిపోయి కాల్పులు జరిపిన దుండగులు
  • ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బీహార్ లో మరో దారుణం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోతెక్కుతున్న ప్రచారంతో పాటు, దాడులు, ప్రతిదాడులు కూడా జరుగుతున్నాయి. తాజాగా, ఓ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రచారసభలోనే హత్య చేయడం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే నారాయణ సింగ్ అనే వ్యక్తి జనతాదళ్ రాష్ట్రవాది పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. షియోహార్ జిల్లాలోని హాత్ సార్ లో ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా దుండగులు ఆయనను కాల్చి చంపారు. కార్యకర్తల్లో కలిసిపోయిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ హత్యతో మరో ఆరుగురికి సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందా? లేక వ్యక్తిగత గొడవల కారణంగా చంపేశారా? అనే కోణంలో దర్యాప్తు చేశారు. మరోవైపు నారాయణ్ సింగ్ పై వివిధ పోలీస్ స్టేషన్లలో 36 కేసులు ఉన్నాయి.
Bihar
MLA Candidate
Murder

More Telugu News