Anil Kumar Yadav: టీడీపీ చేసిన తప్పిదాల వల్లే కేంద్ర సర్కారు కొర్రీలు వేస్తోంది: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

anilkumar slams tdp

  • 2016లో కేంద్ర సర్కారు ప్రకటించిన ప్యాకేజీని స్వాగతించింది
  • చంద్రబాబు సర్కారు అభ్యర్ధనతోనే బాధ్యతలు రాష్ట్రానికి
  • ప్యాకేజీల కోసమే చంద్రబాబు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు
  • ఇప్పుడు మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు

గత  టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల పాటు పోలవరాన్ని పట్టించుకోలేదని, ఆ తర్వాత 2016లో కేంద్ర సర్కారు ప్రకటించిన ప్యాకేజీని స్వాగతించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ ‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. చంద్రబాబు సర్కారు అభ్యర్ధనతోనే పోలవరం నిర్మాణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వానికి అప్పజెప్పారని, ప్యాకేజీల కోసమే చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారని తెలిపారు.  

2014లో సవరించిన అంచనాలతో నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారని, అయితే కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత పెరిగిన అంచనాలను చెల్లించలేమంటూ 2017లో చెప్పిందని అన్నారు. దీన్ని టీడీపీ అప్పట్లో ఎందుకు వ్యతిరేకించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే నేడు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేస్తోందని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ, టీడీపీ నేతలు ఈ రోజు  తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర సర్కారు నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతి సోమవారం పోలవరంలో చంద్రబాబు ఏం పరిశీలించారని ఆయన నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. తాము ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News