Jammu And Kashmir: ఎందుకంత కష్టం.. ఇష్టం లేకుంటే పాక్ వెళ్లిపోవచ్చుగా?: ముఫ్తీపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఆగ్రహం

mufti should go to pakistan with family

  • ఆర్టికల్ 370 రద్దుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు
  • ఇక్కడ తమకు భద్రత లేదనుకుంటే భారత్‌ను విడిచిపెట్టొచ్చు
  • ముఫ్తీకి కావాలంటే విమాన టికెట్లకు డబ్బు పంపిస్తా

మెహబూబా ముఫ్తీకి ఇక్కడ ఉండడం కష్టంగా ఉంటే ఆమె నిరభ్యంతరంగా పాకిస్థాన్ వెళ్లిపోవచ్చని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370పై గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారన్న నితిన్.. ముఫ్తీకి భారతదేశమన్నా, ఇక్కడి చట్టాలన్నా గౌరవం లేదన్నారు.

ఇక్కడి చట్టాలపై గౌరవం లేని ఆమె కుటుంబంతో సహా పాకిస్థాన్ వెళ్లిపోవాలని, కావాలంటే విమాన టికెట్లకు అవసరమైన డబ్బులను తాను పంపిస్తానని అన్నారు. భారత్‌లో తమకు భద్రత, సంతోషం లేవనుకున్న వారు ఎవరైనా సరే దేశాన్ని విడిచిపెట్టడం మంచిదని పేర్కొన్నారు. ఉపఎన్నికల నేపథ్యంలో వడోదరలోని కురారీ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితిన్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News