Nara Lokesh: అందుకే నాపై కేసులు బనాయిస్తున్నారు: నారా లోకేశ్
- రైతులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశాను
- ఇది వైఎస్ జగన్ దృష్టిలో నేరం
- దీనికి కేసులు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవు
- కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపారంటూ కేసులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రైతుల్ని పరామర్శించడం, రైతులకి అండగా పోరాటం చెయ్యడం, రైతులకి న్యాయం చేయాలని డిమాండ్ చెయ్యడం వంటివి వైఎస్ జగన్ దృష్టిలో నేరాలు. ఈ నేరాలపై కేసులు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవు. అందుకే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపారంటూ నాపై కేసులు బనాయించారు’ అని ఆయన అన్నారు.
‘వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే నన్ను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో! కష్టాలలో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా! ప్రతి గడపా తొక్కుతా! బాధితులకు భరోసానిస్తా’ అని నారా లోకేశ్ ట్వీట్లు చేశారు.