Balineni Srinivasa Reddy: రాయలసీమ థర్మల్ ప్లాంట్ ను అమ్మడం లేదు: మంత్రి బాలినేని

Not selling Rayalaseema Thermal Plant says Balineni
  • విద్యుత్ మీటర్లు బిగించడం వల్ల రైతులకు నష్టం లేదు
  • మీటర్లను ఉచితంగానే బిగిస్తాం
  • విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం
వ్యవసాయ బోర్లకు విద్యుత్  మీటర్లను బిగించడం వల్ల రైతులకు ఎలాంటి నష్టం లేదని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు ఈ మీటర్లను ఉచితంగానే బిగిస్తామని చెప్పారు. మీటర్లపై తెలుగుదేశం పార్టీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయబోమని చెప్పారు. రాయలసీమ థర్మల్ ప్లాంట్ ను అమ్మడం లేదని తెలిపారు.

కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నామని బాలినేని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లపై సంఘాలతో చర్చించామని చెప్పారు. ఈరోజు విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో బాలినేని చర్చలు జరిపారు. ముఖ్యమంత్రితో చర్చించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.
Balineni Srinivasa Reddy
Electric meters
YSRCP
Rayalaseema Thermal Plant

More Telugu News