EAMCET: తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఆపాలని జేఎన్టీయూని ఆదేశించిన హైకోర్టు

TS HC orders JNTU to stop EAMCET councelling

  • కరోనా నేపథ్యంలో విద్యార్థులకు 35 కనీస మార్కులు వేసిన వైనం
  • నిబంధనల ప్రకారం ఎంసెట్ కు 45 శాతం మార్కులు ఉండాలి
  • దీంతో అర్హతను కోల్పోయిన ఎందరో విద్యార్థులు

తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ కి హైకోర్టు బ్రేక్ వేసింది. రెండో విడత కౌన్సిలింగ్ ను ఆపాలని జేఎన్టీయూని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు జరగని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు కనీస మార్కులు 35 వేసి తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసింది. అయితే ఎంసెట్ నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షల్లో 45 శాతం మార్కులు కచ్చితంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఎందరో విద్యార్థులు ఎంసెట్ కు అర్హతను కోల్పోయారు.

దీంతో, విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను ఈరోజు విచారించిన హైకోర్టు ప్రభుత్వం తరపు వాదనలను కూడా వినింది. ఈ సందర్భంగా, ఎంసెట్ నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో, ప్రభుత్వం జీవో జారీ చేసేంత వరకు కౌన్సిలింగ్ ని ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News