GHMC: జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు షురూ.. అధికారులను నియమించిన ఎన్నికల సంఘం
- త్వరలోనే మహానగర్ పాలక సంస్థ ఎన్నికలు
- రిటర్నింగ్, సహాయక రిటర్నింగ్ అధికారుల నియామకం
- ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు పోటీకి అనర్హులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉండడంతో రిటర్నింగ్, సహాయక రిటర్నింగ్ అధికారులను ఈసీ నియమించింది. అలాగే, 61 మంది రిటర్నింగ్ అధికారులు, 71 మంది సహాయక రిటర్నింగ్ అధికారులు రిజర్వులో ఉన్నారు.
ఇదిలావుంచితే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు మించి సంతానం వున్న వారు పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధన గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈసారి దీనిని సవరించి, ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి కూడా పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు నిరాకరించారు. అయితే, ప్రస్తుతం ఉన్న వార్డు రిజర్వేషన్ల కొనసాగింపునకు మాత్రం సీఎం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది.