BSP: రాజ్యసభ ఎన్నికల వేళ.. బీఎస్పీ చీఫ్ మాయవతికి ఆరుగురు ఎమ్మెల్యేల షాక్

Six BSP Rebal MLAs with draw support to party rajyasabha candidate

  • వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు
  • రిటర్నింగ్ అధికారిని కలిసిన ఆరుగురు ఎమ్మెల్యేలు
  • తమ సంతకాలను ఫోర్జరీ చేశారని నలుగురి ఫిర్యాదు

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా, అంతలోనే  మాయావతి సారథ్యంలోని బీఎస్పీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చారు. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన బీఎస్పీ సీనియర్ నేత రామ్‌జీ గౌతమ్‌ను ప్రతిపాదించిన 10 మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు అస్లం రైనీ, అస్లం చౌదరీ, ముజ్తబా సిద్దీఖీ, హకీం లాల్‌ బింద్‌ తమ మద్దతును ఉపసంహరించుకోవడమే కాక, పార్టీని వీడుతున్నట్టు చెప్పకనే చెప్పారు.

నిన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రిటర్నింగ్ అధికారిని కలిసి.. రామ్‌జీ గౌతమ్ నామినేషన్ పత్రాలపై తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పార్టీలో తమకు సరైన ప్రాధాన్యం దొరకకపోవడంతో వీరంతా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తాను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను కలిసినట్టు రెబల్స్‌లో ఒకరైన మహిళా ఎమ్మెల్యే తెలిపారు.

  • Loading...

More Telugu News