Assam: మద్యం తాగడంలో అసోం మహిళల తర్వాతే ఎవరైనా!: కేంద్ర సర్వేలో వెల్లడి

Assam women top list of alcohol consumers in India

  • అసోంలో మద్యం తాగుతున్న మహిళలు 26.3 శాతం
  • ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ 3 సర్వేలో తమకంటే ముందున్న రాష్ట్రాలను దాటేసిన అసోం
  • పొగాకు వినియోగంలోనూ వారిదే టాప్ ప్లేస్

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అసోంలో మద్యం తాగుతున్న మహిళలు ఎక్కువని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇక్కడ 15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళల్లో 26.3 శాతం మద్యం తాగుతున్నట్టు 2019-20 గణాంకాలను బట్టి తెలుస్తోంది.

పొరుగునే ఉన్న మేఘాలయలో మాత్రం ఇది 8.7 శాతంగా ఉండడం గమనార్హం. దేశవ్యాప్తంగా మద్యం తీసుకుంటున్న మహిళల్లో పైన పేర్కొన్న వయసు వారు 1.2 శాతమేనని 2015-16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) 4 నివేదికలో పేర్కొన్నారు. 2018-19 నాటి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ 5 సర్వే నివేదిక ఇంకా విడుదల కావాల్సి ఉంది.

2005-06 ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ 3 సర్వే ప్రకారం 15-49 ఏళ్ల వయసున్న అసోం మహిళల్లో మద్యం తాగేవారు 7.5 శాతంగా ఉండగా, అరుణాచల్‌ ప్రదేశ్‌‌లో 33.6 శాతం, సిక్కింలో 19.1శాతం, ఛత్తీస్‌గఢ్‌‌లో 11.4 శాతం, ఝార్ఖండ్‌‌లో 9.9 శాతం, త్రిపురలో 9.6 శాతం మంది ఉన్నారు. సర్వే 3లో 7.5 శాతంగా ఉన్న మద్యం తాగే అసోం మహిళల శాతం, సర్వే 4లో మాత్రం మిగతా రాష్ట్రాలను దాటేసి  26.3 శాతానికి పెరిగింది.

అదే సమయంలో సర్వే 3లో అసోం కంటే ముందున్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఛత్తీస్‌గడ్, ఝార్ఖండ్‌, త్రిపురలలో అది వరుసగా 3.3, 0.3, 0.2, 0.3, 0.8 శాతంగా నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా వారానికి ఒకసారి మద్యం తాగుతున్న మహిళలు 35 శాతం కాగా, అసోంలో ఇది ఏకంగా 44.8 శాతంగా ఉంది. అలాగే, 15-49 ఏళ్ల వయసున్న అసోం పురుషుల్లో 35.6 శాతం మంది మద్యం తాగుతున్నారు. దీంతోపాటు పొగాకు వినియోగంలోనూ అసోం మహిళలు (60 శాతం), పురుషులు (17.7 శాతం)తో మిగతా రాష్ట్రాల కంటే ముందున్నారు.

  • Loading...

More Telugu News