vitamin: కరోనా రోగుల్లో 80 శాతం మంది ‘డీ’ విటమిన్‌ లోపం ఉన్నవారే!

d vitamin deficiency in corona patients

  • మహిళలతో పోలిస్తే పురుషుల్లో డీ విటమిన్‌ తక్కువ
  • రక్తప్రసరణ వ్యవస్థలో ఎన్నో మార్పులు 
  • ‘డీ డైమర్‌’ మోతాదు అధికం 

శరీరంలో ‘డీ’ విటమిన్ తక్కువగా ఉంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కరోనా విజృంభణ సమయంలో డీ విటమిన్ లోపం వల్ల రోగులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఆ విటమిన్ తక్కువగా ఉన్న వారికి కరోనా సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని స్పెయిన్‌ పరిశోధకులు గుర్తించారు. కొవిడ్-19 బారినపడుతున్న 80 శాతం మందిలో ‘డీ’ విటమిన్‌ లోపం ఉందని తేల్చారు.

అలాగే, మహిళలతో పోలిస్తే పురుషుల్లో డీ విటమిన్‌ తక్కువగా ఉందని చెప్పారు. ఆ విటమిన్‌ లోపించిన వారి రక్తప్రసరణ వ్యవస్థలో ఎన్నో మార్పులు జరిగినట్లు తెలిపారు. ఐరన్‌ను నిల్వ చేసే ప్రొటీన్‌ ‘ఫెర్రిటిన్‌’తో పాటు గడ్డ కట్టిన రక్తం తిరిగి సాధారణ స్థితికి చేరిన  అనంతరం రక్తంలో కనిపించే ‘డీ డైమర్‌’ మోతాదు పెరిగిపోతోందని చెప్పారు. అలాగే, అప్పటికే చాలా కాలంగా వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు, ఆరోగ్య సిబ్బందిపై దీని ప్రభావం అధికంగా ఉందని వివరించారు.

  • Loading...

More Telugu News