IYR Krishna Rao: రాష్ట్రావతరణ దినోత్సవం అక్టోబర్ ఒకటి సరైనదని ఇందులో రాశాను: ఐవైఆర్

iyr tweets about ap
  • "నవ్యాంధ్ర-నా నడక "పుస్తకంలో నా వివరణ
  • 1953, అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది
  • అక్టోబరు 1కి ప్రాధాన్యత ఉందని అందులో రాశాను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుభాకాంక్షలు తెలుపుతూ పలు విషయాలు తెలిపారు.

‘కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి అవతరణ దినోత్సవం అక్టోబర్ ఒకటి సరైనది అని వివరిస్తూ ఆ రోజు "నవ్యాంధ్ర-నా నడక "పుస్తకంలో నా వివరణ. ప్రభుత్వం నవంబర్ 1 నిర్వహించటానికి నిశ్చయించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని అన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి అవతరణ దినోత్సవం అక్టోబర్ 1 సరైందని వివరిస్తూ రాసిన విషయానికి సంబంధించిన ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. 1953, అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది కాబట్టి అక్టోబరు 1కి ప్రాధాన్యత ఉందని అందులో ఆయన రాశారు.
   
IYR Krishna Rao
Andhra Pradesh

More Telugu News