attorney general: సీఎం జగన్ వ్యవహారంలో లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయకు లేఖ రాసిన అటార్నీ జనరల్
- సీఎం జగన్ పై కోర్టు ధిక్కారం కేసు నమోదుకు అనుమతి కోరిన అశ్వినీ
- అనుమతి ఇవ్వలేనన్న అటార్నీ జనరల్
- సీజేఐకి అన్ని విషయాలు తెలుసన్న అటార్నీ జనరల్
భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తాజాగా లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయకు లేఖ రాశారు. సీఎం జగన్ పై కోర్టు ధిక్కారం కేసు నమోదు కోసం తాను అనుమతి ఇవ్వలేనని అటార్నీ జనరల్ తన లేఖలో అశ్వినీ కుమార్ ఉపాధ్యాయకు స్పష్టం చేశారు.
ఢిల్లీకి చెందిన లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ గతంలో సీఎం జగన్ పై కోర్టు ధిక్కారం కేసు నమోదు కోసం అటార్నీ జనరల్ కు లేఖ రాశారు. అందులో సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీనిపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తాజాగా ప్రత్యుత్తరం ఇచ్చారు.
జగన్ పై 31 కేసులు ఉన్నాయని, ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు ఇచ్చిన తర్వాత జగన్ ఈ లేఖ రాయడం అనేక అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. అయితే అన్ని విషయాలు సీజేఐకి తెలుసని, అందుకే కోర్టు ధిక్కారం కింద కేసు నమోదుకు తాను ప్రత్యేకంగా అనుమతి ఇవ్వలేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వెల్లడించారు.