Shraddha Kapoor: దీపికా పదుకొనేను వెనక్కి నెట్టేసిన శ్రద్ధా కపూర్

Shraddha Kapoor crosses Deepika Padukune in Instagram
  • ఇన్స్టాలో అత్యధిక ఫాలోయర్లను కలిగిన మూడో సెలబ్రిటీగా శ్రద్ధ
  • 82.2 మిలియన్ ఫాలోయర్లతో తొలి స్థానంలో ఉన్న కోహ్లీ
  • రెండో స్థానంలో కొనసాగుతున్న ప్రియాంకచోప్రా
'సాహో' భామ శ్రద్ధాకపూర్ ను అభిమానిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ సరసన నటించిన తర్వాత ఆమెకు తెలుగులో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అత్యధికంగా ఫాలోయర్లను కలిగిన భారతీయ సెలబ్రిటీల జాబితాలో శ్రద్ధ మరో స్థానం పైకి ఎదిగింది. మొన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న శ్రద్ధ... తాజాగా దీపికా పదుకొనేను కిందకు నెట్టేసి మూడో స్థానానికి చేరుకుంది. దీపిక నాలుగో స్థానానికి పడిపోయింది.

ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోయర్లను కలిగిన సెలబ్రిటీగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీని మొత్తం 82.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో 58.1 మిలియన్ల ఫాలోయర్లతో ప్రియాంకచోప్రా కొనసాగుతోంది. మూడో స్థానానికి ఎగబాకిన శ్రద్ధా కపూర్ కు 56.4 మిలియన్ల ఫాలోయర్లు ఉండగా... దీపికా పదుకొనేను 52.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

'సాహో' తర్వాత శ్రద్ధా కపూర్ మరో పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. విశాల్ పురియా దర్శకత్వం వహించనున్న చిత్రంలో 'నాగిని'గా అలరించబోతోంది. దివంగత శ్రీదేవి గతంలో నటించిన 'నాగిని' కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. నిఖిల్ ద్వివేది ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.
Shraddha Kapoor
Instagram
Followers
Bollywood
Deepika Padukone
Priyanka Chopra
Virat Kohli

More Telugu News