GHMC Elections: నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం

Telangana EC sends 30K ballot boxes to AP for local body elections

  • ఈ నెల 13న రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల తుది ఓటర్ల జాబితా 
  • 150 డివిజన్లకు 150 మంది ఆర్ఓల నియామకం  
  • ఎన్నికల నిర్వహణకు 30 వేల బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయి

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఉన్న ప్రత్యేకత వేరు. నగర ప్రజలలో ఈ ఎన్నికలు ఎప్పుడూ ఉత్కంఠను రేపుతుంటాయి. త్వరలో జరగబోయే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ఈ నెల 13న రానుందని తెలిపింది.

ఇక నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. జీహెచ్ఎంసీలో 150 డివిజన్లకు 150 మంది ఆర్ఓలను నియమించినట్టు ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. ప్రతి వార్డుకు సగటున 50 పోలింగ్ కేంద్రాలు ఉంటాయని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు 30 వేల బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయని తెలిపారు. మరోవైపు ఏపీ స్థానిక ఎన్నికల కోసం 30 వేల బ్యాలెట్ బాక్సులను పంపినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News