Madhya Pradesh: వివాహం కోసం మతం మార్చుకోవడాన్ని నిషేధిస్తూ మధ్యప్రదేశ్‌లో త్వరలో చట్టం
- వరుసగా వెలుగులోకి వస్తున్న ‘లవ్ జిహాద్’ తరహా ఘటనలు
- వివాహం పేరుతో మతం మార్చుకోవడంపై ఉక్కుపాదం
- త్వరలోనే కఠిన చట్టాన్ని తీసుకొస్తామన్న సీఎం
వివాహం కోసం మతం మార్చుకుంటున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో దీనిని నిషేధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. వివాహం పేరుతో మతం మార్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు.
దీనిని తాము ఎంతమాత్రమూ సహించబోమని, దీనిని అడ్డుకునేందుకు కఠిన చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు. త్వరలోనే ఈ చట్టం అమల్లోకి వస్తుందన్నారు. లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు ఇటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ కూడా ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.