Kodandaram: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా గాలికి వదిలేసింది: కోదండరాం

Kodandaram slams Telangana government over education situations

  • ఆన్ లైన్ విద్య అందరికీ అందడంలేదన్న కోదండరాం
  • విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకటించాలని సూచన
  • పాఠశాలల విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని డిమాండ్

తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సర్కారు విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. విద్యార్థులను గాలికి వదిలేసిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకటించాలని అన్నారు. విద్యా సంవత్సరంపై నిపుణులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.  

ఆన్ లైన్ క్లాసుల ద్వారా అందరికీ విద్య అందడంలేదని తెలిపారు. ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని వెల్లడించారు. కళాశాల విద్యార్థుల మాదిరిగా పాఠశాలల విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News