Black Tiger: ఒడిశా అడవుల్లో దర్శనమిచ్చిన అరుదైన నల్లపులి

Very rare black tiger spotted in Odisha

  • కెమెరా కంటికి చిక్కిన నల్లపులి
  • సిమ్లిపాల్ అడవుల్లో నల్లపులిని చూసిన ఫొటోగ్రాఫర్
  • మెలనిన్ ఆధిక్యం వల్ల నలుపురంగులో పులులు

కొన్ని పులులు జన్యులోపాలతో ఇతర రంగుల్లో దర్శనమిస్తుంటాయి. ఎక్కువగా ఇలాంటి పులులు తెలుపు రంగులో కనిపిస్తుంటాయి. అయితే ఒడిశా అడవుల్లో ఓ నల్ల పులి కెమెరా కంటికి చిక్కింది. ఈ పులిపై పసుపు చారలు తక్కువ సంఖ్యలో ఉండగా, అత్యధికభాగం నలుపు రంగులోనే ఉంది. సౌమెన్ బాజ్ పాయ్ అనే ఫొటోగ్రాఫర్ ఈ నల్లపులిని ఫొటోలు తీయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని సిమ్లిపాల్ పులుల అభయారణ్యంలో ఈ నల్లపులిని గుర్తించారు.

అడవిలో ఫొటోల కోసం వెళ్లినప్పుడు అనేక పులులు, ఇతర జంతువులు, పక్షులు కనిపించాయని సౌమెన్ బాజ్ పాయ్ తెలిపారు. ఉన్నట్టుండి ఈ నల్లపులి రావడంతో మొదట దానిని తాను గుర్తించలేకపోయానని, ఆ తర్వాతే అది అరుదైన పులి అన్న విషయం అర్థమైందని వివరించారు. దాంతో ఆ బ్లాక్ టైగర్ ను కొన్ని ఫొటోలు తీశానని, ఇలాంటి పులి తన కంటబడడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

కాగా, ఒడిశాలోని అటవీప్రాంతాల్లో నల్లపులులు కనిపించడం ఇదే తొలిసారి కాదు. 90వ దశకంలోనూ ఇదే ప్రాంతంలో నల్లపులిని చూశారు. పులుల్లో మెలనిన్ పదార్థం ఎక్కువైనప్పుడు నలుపు రంగులో కనిపిస్తాయి. పరిమాణంలో రాయల్ బెంగాల్ టైగర్ కంటే కాస్త చిన్నవిగా కనిపించే ఈ నల్లపులులు ప్రస్తుతం దేశంలో వేళ్లమీద లెక్కించగలిగిన స్థాయిలోనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News