Jawahar: సోము వీర్రాజు వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానుకోవాలి: మాజీ మంత్రి జవహర్

Former minister Jawahar comments on AP BJP President Somu Veerraju
  • చంద్రబాబు లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారన్న సోము
  • పోలవరంపై వాస్తవాలు మాట్లాడాలని జవహర్ హితవు
  • నీతి ఆయోగ్ సిఫారసుతోనే నిర్మాణ బాధ్యత ఇచ్చారని వివరణ
టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ధ్వజమెత్తారు. సోము వీర్రాజు వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానుకోవాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పినా, దానిపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నీతి ఆయోగ్ సిఫారసు మేరకే పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి ఇచ్చారని స్పష్టం చేశారు.

అంతకుముందు సోము వీర్రాజు రాజమండ్రి ప్రెస్ మీట్ లో పోలవరం నేపథ్యంలో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. పోలవరం విషయంలో లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలడని అన్నారు.
Jawahar
Somu Veerraju
Chandrababu
Polavaram Project
Andhra Pradesh

More Telugu News