Hyundai: భారత్ లో ఐ20 అప్ డేటెడ్ వెర్షన్ ను తీసుకువచ్చిన హ్యుందాయ్

 Hyundai introduced all new i twenty in Indian market

  • సెన్సువస్ స్పోర్టీనెస్ గ్లోబల్ డిజైన్ తో మెరుగులు
  • 50 ఫీచర్లతో బ్లూలింక్ కనెక్టివిటీ
  • మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్
  • యాంటీ థెఫ్ట్ ట్రాకింగ్ సిస్టమ్
  • ప్రారంభ మోడల్ ధర రూ.6.80 లక్షలు

భారత కార్ల విపణిలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తాజాగా ఐ20 అప్ డేటెడ్ వర్షెన్ ను తీసుకువచ్చింది. 'సెన్సువస్ స్పోర్టీనెస్ గ్లోబల్ డిజైన్' తో మరింత మెరుగులు దిద్దుకున్న ఈ సరికొత్త ఐ20తో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వగలమని హ్యుందాయ్ భావిస్తోంది.

50 ఫీచర్లతో కూడిన ఏఐ ఆధారిత బ్లూలింక్ కనెక్టివిటీ, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ లు, క్రోమ్ డెకొరేటేడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ లు, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, హెచ్ డీ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ప్రపంచ ప్రఖ్యాత ప్రీమియం బ్రాండ్ బోస్ సౌండ్ సిస్టమ్ (సెవెన్ స్పీకర్ కాన్ఫిగరేషన్) దీంట్లో పొందుపరిచారు.

ఇవే కాకుండా, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బ్లూ యాంబియెంట్ లైటింగ్, వైర్ లెస్ చార్జర్ విత్ కూలింగ్ ప్యాడ్, స్పీడ్ అలెర్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఆక్సిబూస్ ఎయిర్ ప్యూరిఫయర్, యాంటీ థెఫ్ట్ ట్రాకింగ్ సిస్టమ్, జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్లతో ఈ బ్రాండ్ న్యూ ఐ20 మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది.

ఆరు సింగిల్ టోన్ కలర్స్ లోనూ, రెండు డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్లలోనూ హ్యుందాయ్ ఐ20 లభిస్తుంది. ఈ కారు ధరల రేంజి రూ.6.80 లక్షల నుంచి రూ.11.18 లక్షల వరకు ఉంది.

  • Loading...

More Telugu News