JP Nadda: తేజశ్వి యాదవ్ ముందు ఈ విషయం గురించి మాట్లాడాలి: జేపీ నడ్డా

JP Nadda fires on Tejashwi Yadav

  • 15 ఏళ్ల ఆర్జేడీ పాలనలో అరాచకాన్ని వ్యాప్తి చేశారు
  • లాలూ హయాంలో 25 లక్షల మంది వలస వెళ్లారు
  • బీహార్ ఎన్నికలు అభివృద్ధికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న పోరాటం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రాన్ని ఆర్జేడీ 15 ఏళ్ల పాటు పాలించిందని... ఆ సమయంలో అరాచకాన్ని వ్యాప్తి చేసిందని అన్నారు. విధ్వంసకర ఆలోచన కలిగిన సీపీఐ (ఎంఎల్)తో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయని మండిపడ్డారు. బీహార్ ఎన్నికలు అభివృద్ధికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు.

అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తానని తేజశ్వి హామీ ఇచ్చారని... ముందు ఆయన తండ్రి లాలూ హయాంలో వలసపోయిన 25 లక్షల మంది గురించి మాట్లాడాలని నడ్డా ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీపై కూడా ఆయన మండిపడ్డారు. రాహుల్ కు ఎంతసేపు ప్రధాని మోదీని విమర్శించాలనే ఆలోచనే తప్ప జాతీయ ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. ఈ ఎన్నికలు బీహార్ భవిష్యత్తుకు సంబంధించినవని నడ్డా అన్నారు.

  • Loading...

More Telugu News