Arnab goswami: అర్నాబ్‌కు హైకోర్టులో చుక్కెదురు.. ఇప్పటికిప్పుడు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న కోర్టు.. నేడు మళ్లీ విచారణ

No Relief For Now For Arnab Goswami High Court To Hear Plea Today

  • 2018 నాటి ఆత్మహత్యల కేసులో అరెస్ట్ అయిన అర్నాబ్
  • అర్నాబ్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపణ
  • నేటి మధ్యాహ్నానికి విచారణ వాయిదా   

2018 నాటి ఓ కేసులో అరెస్ట్ అయిన రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు నిన్న విచారించింది. అయితే, కేసు పూర్వాపరాలను విచారించకుండా ఇప్పటికిప్పుడు మధ్యంతర బెయిల్ ను ఇవ్వలేమని పేర్కొంది.

 అర్నాబ్ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టులో తన వాదనలు వినిపిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అర్నాబ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం, ఆత్మహత్య చేసుకున్న అన్వయ్ నాయక్ భార్య అక్షతలను తమ వాదనలు వినిపించాల్సిందిగా కోరుతూ నేటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

ఆర్కిటెక్చర్-ఇంటీరియర్ డిజైనర్ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్య కేసును బాధిత కుటుంబం అభ్యర్థనపై తిరిగి ఓపెన్ చేసిన  ప్రభుత్వం అర్నాబ్ గోస్వామి, ఫిరోజ్ షేక్, నితేశ్ సర్దాలను అరెస్ట్ చేసి అలీబాగ్ కోర్టులో ప్రవేశపెట్టారు. అర్నాబ్‌ను పోలీసు కస్టడీకి అప్పగించాలంటూ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు, 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. 

  • Loading...

More Telugu News